స్టంట్ బైకర్లపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల బ్రహ్మాస్త్రం

సరే ఇదంతా అటుంచి అసలు విషయానికి వస్తే, దేశ ఐటి రాజధానిగా చెప్పుకునే బెంగుళూరులో ఇలాంటి స్టంట్ బైకింగ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. బెంగుళూరులోని కొన్ని ప్రముఖ రోడ్లపై ఈ స్టంట్ బైకింగ్ చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం పట్ల చిర్రెత్తిన పోలీసులు ఇలా స్టంట్ బైకింగ్ చేసే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని వారి లైసెన్సులను రద్దు చేశారు. ఇప్పటికే 15 మంది యువకుల డ్రైవింగ్ లైసెన్సులను పోలీసులు రద్దు చేశారు.
ఇకపై ఎవరైనా ఇలా స్టంట్ బైకింగ్ చేసినట్లు గుర్తి వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా.. తాగి డ్రైవింగ్/రైడింగ్ చేయటం, రైడ్/డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిచడం వంటి సందర్భాలను కూడా సీరియస్ తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. మన హైదరాబాద్ నగరంలో కూడా (ముఖ్యంగా నక్లెస్ రోడ్ ప్రాంతంలో) ఇలాంటి బైక్ స్టంట్‌లను తరచూ గమనిస్తూనే ఉంటాం.
మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తే ఇకపై మరిన్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. మీరేమంటారు..??


Click it and Unblock the Notifications








