ఈ బైక్ మైలేజ్ ఎంతో తెలుసా...! లీటరుకు 110 కి.మీ. మాత్రమే..!

Diesel Bike
సాధారణంగా ఓ 200 సీసీ బైక్ లీటరుకు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. మహా అయితే 45-55 కి.మీ. మధ్య ఉంటుంది. కానీ ఈ బైక్ మాత్రం సాధారణ మైలేజ్ కన్న రెండు రెట్లు అధికంగా, అంటే 110 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. 200 సీసీ బైక్ ఏంటి లీటరుకు 110 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం ఏంటి అసాధ్యం అంటారా..? కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం, నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల అద్భుత సృష్టే ఈ బంపర్ బైక్ బెంగుళూరులోని ఎమ్ ఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకు చెందిన నలుగురు ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులు ఓ డీజిల్ బైక్‌ను రూపొందించారు. అది లీటరుకు 110 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుందని వారు అంటున్నారు.

ఈ ప్రాజెక్టును డాక్టర్ ఎస్.వి. ప్రకాష్ ఆధ్వర్యంలో నవీన్ వీవీ, టోనీ పౌల్, నదీమ్ అన్వర్, సంజయ్ భూషన్ అనే నలుగురు విద్యార్థులు చేపట్టారు. కైనటిక్ బ్లేజ్‌ స్కూటర్‌కు బుల్లెట్ ఇంజన్‌ను బిగించి, దానికి మరమ్మత్తులు చేసి చివరకు వారు అనుకున్నది సాధించారు. బెంగుళూరు మరియు కొయంబత్తూరులోని వివిధ వర్క్‌షాపులలో నాలుగు నెలల పాటు శ్రమించి ఈ బంపర్ బైక్‌కు రూపకల్పన చేశారు. 325 సీసీ ఇంజన్‌ను 200 సీసీకి కుదించడమే కాకండా, ఫ్లైవీల్ బరువును 7 కేజీలకు తగ్గించారు. ఇంకా హార్స్‌పవర్‌ను 6.5 బిహెచ్‌పిల నుంచి 3.5 బిహెచ్‌పిలకు తగ్గించి దీన్ని తయారు చేశారు.

ఈ బైక్‌ను రూపొందించడానికి తమకు రూ. 70,000 ఖర్చు అయిందని, దీన్ని పూర్తిస్థాయిలో కమర్షియల్ ఉత్పత్తి చేస్తే మాత్రం ఇది కేవలం రూ. 55,000 నుంచి రూ. 60,000లకే లభిస్తుందని ఓ విద్యార్థి తెలిపాడు. డీజిల్‌తో బైక్‌లు నడవటం చాలా అరుదని, అందుకే తాము డీజిల్‌తో నడిచే బైక్‌ను తయారు చేయాలనుకున్నామని మరో విద్యార్థి తెలిపాడు. తమకు తెలిసిన దాని ప్రకారం.. భారత్‌లో ఆటోమేటిక్ గేర్, ఆటోమేటిక్ క్లచ్ కలిగిన ఓ డీజిల్ ఇంజన్ టూ-వీలర్‌ను మొట్టమొదిచటిగా రూపొందించింది తామేనని వారు తెలిపారు. తారాజువ్వాల పైకెగురుతున్న పెట్రోల్ ధరలను తట్టుకోవాలంటే ఇలాంటి ప్రత్యామ్నాయ బైక్‌ల అవసరం మనకు ఎంతైనా ఉంది కదూ..! మరి మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Tuesday, June 7, 2011, 17:50 [IST]
English summary
Four engineering students from Bangalore's M S Ramaiah Institute of Technology have developed a diesel bike that gives a mileage of 110kmpl. It was reported that the young students amely Naveen V V, Tony Paul, Nadeem Anwar and Sanjay Bhushan took the challenge of developing a two wheeler diesel engine with automatic gear and automatic clutch and have successfully carried out the project.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+