హీరో హోండా కన్నా మంచి మార్జిన్లు: బజాజ్ ఆటో

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (2011-12) తొలి త్రైమాసికం (ఏప్రిల్ 2011 - జూన్ 2011)లో హీరో హోండా నికర లాభం 14 శాతం పెరిగి, గడచిన నాలుగు త్రైమాసికాల ఫలితాలను తలకిందులు చేస్తూ కొత్త ట్రెండ్ సృష్టించింది. కానీ, ఈ త్రైమాసికంలో బజాజ్ ఆటో మాత్రం నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. అయితే, పెరిగిన ముడి సరుకుల ధరల కారణంగా రెండు కంపెనీలు కూడా ఇయర్-ఆన్-ఇయర్ బేసిస్ ప్రకారం నిర్వాహక ఆదాయ మార్జిన్లలతో తగ్గుదలను చూశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మార్జిన్లు దాదాపు 19 శాతం వరకూ వృద్ధి చెందగలవని బజాజ్ ఆటో యాజమాన్యం అంచనా వేస్తుంది. హీరో హోండా విక్రయాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఆదాయాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. కమోడిటీ ధరలు దిగివస్తే.. మార్జిన్లు మెరుగుపడతాయని కంపెనీ సీఎఫ్ఓ రవి సూద్ తెలిపారు.


Click it and Unblock the Notifications








