మరోసారి పరుగులు పెట్టనున్న బైక్‌ల ధరలు

టీవీఎస్ బాటలోనే దేశీయ రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కూడా అడుగులు వేస్తుంది. అయిదే దేశీయ అగ్రగామి ద్విచక్రవాహన సంస్థ హీరో హోండా మాత్రం వేచి చూద్దాం అనే ధోరణితో వ్యవహరిస్తోంది. దీనిపై హీరో హోండా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడు ధరల పెంపు ఉండదని, బైక్‌ల తయారీకి వాడే విడిభాగాల ధరలు భారమవుతున్నందున కంపెనీ నష్టాలను తగ్గించేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తామని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా కొన్ని ఆటో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








