ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించి బిఎమ్‌డబ్ల్యూ

తొలుత ఊహలకు మాత్రమే పరిమితమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు బిఎమ్‌డబ్ల్యూ వాస్తవ రూపాన్ని కల్పించింది. పురాతన సాంప్రదాయ ఇంజన్ కలిగిన ఏ 600 సీసీ స్కూటర్‌తో పోల్చుకున్నా తమ స్కూటర్ పెర్ఫామెన్స్ సమానంగా ఉంటుందని బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది. ఇది గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ ఈ-స్కూటర్ చార్జింగ్ పూర్తిగా అయిపోయినప్పటికీ, దీని బ్యాటరీ కేవలం మూడు గంటల్లోనే తిరిగి పూర్తిగా రీచార్జ్ అవుతుంది. సూపర్‌బైక్ లుక్ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనది. ఇందులో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. మనం రైడ్ చేస్తున్నంతసేపు ఓ వైపు బ్యాటరీ పవర్ ఖర్చు అవుతూనే మరోవైపు చార్జింగ్ అవుతుంటుంది.


Click it and Unblock the Notifications








