1000 సీసీకు దిగువ బైక్‌లను ప్రవేశపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్‌కు భారత్‌లో స్వతహాగా ఎలాంటి ప్రత్యక్ష ఔట్‌లెట్లు లేవు. ఈ సూపర్‌బైక్‌లను పూర్తిగా సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్‌లో బెర్లిన్ నుండి భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. ఢిల్లీలోని డష్చీ మోటోరెన్, ముంబైలోని నవనీత్ మోటార్స్ డీలర్ల ద్వారా బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఏడాది జనవరి నెలలోనే బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
భారత్‌లో తాము ఇప్పటికే 39 బైక్‌లను విక్రయించామని, ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 50కు పైగా బైక్‌లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని కచాలియా తెలిపారు. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ భారత్‌లో ఆరు మోడళ్లను విక్రయిస్తుంది. ఇవన్నీ కూడా 1000సీసీ ఎగువన ఉన్న సూపర్‌బైకులే. ఆర్1200ఆర్, ఎస్1000ఆర్ఆర్, ఆర్1200జిఎస్, కె1300, కె1600జిటిఎల్ మరియు హెచ్‌పి2 అనే మోడళ్లను బిఎమ్‌డబ్ల్యూ విక్రయిస్తోంది. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.18 లక్షల నుండి రూ.25 లక్షల వరకూ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








