1000సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన బిఎమ్‌డబ్ల్యూ బైక్స్!

BMW Super Luxury Bike
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ గడచిన జనవరిలో భారత లగ్జరీ మోటార్‌సైకిల్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లను ఈ ఏడాది 45 యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే కంపెనీ 15 మోటార్‌సైకిళ్లను విక్రయించిందని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిల్ వెంచర్ అయిన బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఢిల్లీ, ముంబైలలో తమ అవుట్‌లెట్ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ పూర్తిగా జర్మనీలో తయారైన తమ మోటార్‌సైకిళ్లను భారత్‌లోకి దిగమతి చేసుకొని విక్రయిస్తుంది. కానీ.. కంపెనీ వీటిని సికెడిలుగా దిగుమతి చేసుకుని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయాలనే యోచనలో ఉంది. అయితే భారత్‌లో అసెంబ్లింగ్ ప్రారంభించేలోపు ఇక్కడి మార్కెట్లో కనీసం 100 బైక్‌లు విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. తమ మోటార్‌సైకిళ్లకు భారత్‌లో మార్కెట్ పరిమాణం పెరిగినట్లయితే.. ఇక్కడ ఉన్న తమ అనుబంధ సంస్థతో కార్యకలాపాలు ప్రారంభించే విషయం గురించి ఆలోచిస్తామని కంపెనీ ప్రతినిది వివరించారు.

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ భారత్‌లో ఆరు మోడళ్లను అందిస్తోంది. వీటిలో ఎస్1000ఆర్ఆర్, కె13000, ఆర్12000 జిఎస్, కె1600జిటిఎల్, ఆర్1200ఆర్, హెచ్‌పి2 స్పోర్ట్స్‌ మోడల్ బైక్‌లు ఉన్నాయి. ఈ మోటార్‌సైకిళ్లన్నీ కూడా 1000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా ధర విషయంలో కూడా అధికంగా ఉన్నాయి. వీటి ధరలు రూ. 18-23 లక్షల శ్రేణిలో ఉన్నాయి.

బ్రాండ్‌ నేమ్‌ను మార్కెటింగ్ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు భారత్‌లో రోడ్‌షోలు నిర్వహించడమే కాకుండా.. కంపెనీ ఇప్పటికే మోటార్ షోలలో పాల్గొన్నట్లు ముంబైకు చెందిన బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌సైకిళ్ల దిగుమతిదారైన నవనీత్ మోటార్స్ ఎండి షరద్ కచాలియా వెల్లడించారు. అంతేకాకుండా.. 2012 నాటికి బిఎమ్‌డబ్ల్యూ 1,000 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైక్‌లను కూడా భారత్‌లో విడుదల చేయనున్నట్లు కచాలియా పేర్కొన్నారు. భారత్‌లో సూపర్-ప్రిమీయం బైక్‌ల మార్కెట్ ఏటా దాదాపు 1,000 వరకూ ఉండవచ్చునని అంచనా.

Article Published On: Wednesday, March 30, 2011, 8:11 [IST]
English summary
German luxury car maker's motorcycle arm BMW Motor rad, aims to sell 45 motorcycles in this year. Company has launched its super-premium bikes in India recently. BMW is offering six models initially, which include S1000RR, K1300, R1200GS, K1600GTL, R1200R and HP2 Sports. According to sources BMW is also looking at introducing bikes below 1,000cc by 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+