ఫ్లయింగ్ బైక్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేసిన ఫిల్ పౌలే

జెట్ ఇంజన్, డబుల్ డిస్క్ బ్రేక్స్, విమాన ఆకారంలో ఉండే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్, నాలుగు రెక్కలు, బైక్ వెనుక భాగంలో ఓ చిన్న ఫ్యాన్ ఇవన్నీ కలిపి, చూడటానికి ఇదొక చిన్నసైజు టాప్‌లెస్, సింగిల్ చార్టెడ్ ఫ్లైట్‌లా కనిపిస్తుంది. ఈ బైక్ ముందు భాగం మొత్తం జెట్ ఇంజన్ డామినేట్ చేస్తుంది. బైక్‌కు ఉండే రెక్కల్లో అధనంగా ఇంధనాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది గంటకు 300 మైళ్ల (480 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణించగలదని ఫిల్ చెబుతున్నాడు. మరి పౌలే ఊహలు కంప్యూటర్‌పై నుంచి రోడ్డపైకి రావాలంటే ఈ ప్రాజెక్టు ప్రాణం పోసేందుకు ఏ ఆటోమొబైల్ కంపెనీ ముందుకు వస్తుందో వేచి చూడాలి. ఏదైతేనే ఫిల్ కాన్సెప్ట్ సూపరో సూపరు..! మరి మీరేమంటారు..!?


Click it and Unblock the Notifications








