మహీంద్రా స్కూటర్‌ కొనుగోలుపై రూ.1500 పెట్రోల్ ఫ్రీ

Mahindra Scooters
పెట్రోల్ ధరలు పెరిగాయని చింతిస్తున్నారా... అయితే, ఇకపై ఆ సమస్యను మర్చిపోండి. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ ఇప్పుడు ఓ ఆకర్షనీమైన ఆఫర్‌ను ప్రకటించింది. మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న స్కూటర్లను కొనుగోలు చేసిన వారికి 1,500 రూపాయల విలువ చేసే పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తోంది.

ఈ మేరకు రూపొందించిన ఓ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను కూడా కంపెనీ విడుదల చేసింది. లాంగ్ డ్రైవ్ థీమ్ నేపథ్యంలో ఈ వాణిజ్య ప్రకటన సాగుతుంది. మహీంద్రా స్కూటర్స్‌కు ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం మహీంద్రా టూవీలర్స్ రోడియో, డ్యూరో, ఫ్లయట్ మరియు కైన్ అనే నాలుగు స్కూటర్లను దేశీయ విపణిలో అందిస్తుంది.

కాగా.. ఇది వరకు మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ఓ 110 సీసీ మోటార్‌సైకిల్, స్టాలియోను విడుదల చేసినప్పటికీ, ఆ మోడల్‌లోని గేర్‌బాక్స్‌లో తలెత్తిన లోపం కారణం వివిధ ఫిర్యాదులు అందడంతో కంపెనీ తాక్కాలికంగా ఈ మోడల్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే, ప్రస్తుత పండుగ సీజన్‌లో స్టాలియో మోటార్‌సైకిల్‌ను పునఃప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2011, 10:16 [IST]
English summary
Mahindra and Mahindra's two-wheeler arm Mahindra 2 wheelers is now offering Rs 1500 worth of petrol on purchasing of their scooters. Bollywood actress Karina Kapoor is the brand ambassador for Mahindra Scooters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+