మహీంద్రా పెట్రోల్ ఆఫర్ ఇప్పుడు అక్టోబర్ 31 వరకూ!

మహీంద్రా స్కూటర్స్‌కు ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం మహీంద్రా టూవీలర్స్ రోడియో, డ్యూరో, ఫ్లయట్ మరియు కైన్ అనే నాలుగు స్కూటర్లను దేశీయ విపణిలో అందిస్తుంది. మహీంద్రా స్కూటర్లు 2009లో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పటి వరకూ ఇవి 2,90,000 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ వెల్లడించింది.
కాగా.. ఇది వరకు మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ఓ 110 సీసీ మోటార్‌సైకిల్, స్టాలియోను విడుదల చేసినప్పటికీ, ఆ మోడల్‌లోని గేర్‌బాక్స్‌లో తలెత్తిన లోపం కారణం వివిధ ఫిర్యాదులు అందడంతో కంపెనీ తాక్కాలికంగా ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే, ప్రస్తుత పండుగ సీజన్‌లో స్టాలియో మోటార్‌సైకిల్‌ను పునఃప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








