అధునాత టెక్నాలజీ మీ కారు మరింత భద్రం..!

Smart Car
ఈ టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి విషయంలోను "మార్పు" అనేది సహజమైన విషయమైపోయింది. ఇలా మారుతున్న టెక్నాలజీ జాబితాలోకి తాజాగా కార్లు కూడా చేరిపోనున్నాయి. ఇప్పటి వరకూ మానవ ప్రమేయంతో పనిచేస్తున్న కార్లు ఇకపై పూర్తిగా ఆటోమేటిక్ కానున్నాయి. కార్ల తయారీలో పాత చింతకాయ పద్దతులకు స్వస్తి పలికేందుకు ఆటమొబైల్ కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్నాయి. తయారీ, సర్వీసింగ్, ఆయిల్ ఛేంజ్, యాంటిలాకింగ్ సిస్టమ్ ఇలా ఒక్కటేంటి కారుకు సంబంధించిన ప్రతి అంశం మారుతున్న టెక్నాలజీతో అప్‌గ్రేడ్ కానుంది.

కంప్యూటర్ సహాయంతో మీ కారు ఇంజన్ హార్స్‌పవర్‌ను పెంచుకోవచ్చు, అంతేకాకుండా.. కారుకే నావిగేషన్‌తో కూడిన ఒక వైర్‌లెస్ టెలిఫోన్ కనెక్షన్‌ను కూడా అమర్చుకోవచ్చు. ఈ విధంగా కారులో నావిగేషన్ సిస్టమ్‌ను అమర్చడం వల్ల శాటిలైట్ వ్యవస్థ ద్వారా కారు సంబంధించిన సమాచారాన్ని ప్రతిక్షణం గమనించవచ్చు. దీని ద్వారా కారు దొంగింలిపబడే అవకాశం ఉండదు. ఒకవేళ అలా జరిగిన జిపిఎస్ సిస్టమ్ ద్వారా కారు ఎక్కడ ఉందో ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఇంకా జేమ్స్ బాండ్ సినిమాల్లో మాదిరి కారులో మనిషి లేకుండానే.. మన చేతిలో కంప్యూటర్ స్క్రీన్ ఆధారంగా కారును నడపవచ్చు. బయటి వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు కార్లలో జీ-ఫోర్స్ మీటర్‌ను అమర్చవచ్చు.

కారుకు అమర్చబడే అధునాతన సెన్సార్ల ద్వారా ముందుగా జరగబోయే యాక్సిడెంట్లను కూడా గుర్తించి అప్రమత్తంగా ఉండవచ్చు. హెచ్చిరింపు సూచికలు (వార్నింగ్ సిగ్నల్స్), అప్రమత్త సందేశాలు (అలెర్ట్ మెసేజెస్) కూడా ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమే. ప్రస్తుతం కంపెనీలు తాము తయారుచేయబోయే కార్లలో ఈ టెక్నాలజీని వాడేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా పరిశోధకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి ఇది పూర్తి స్థాయిలో ఆచరణలోకి ఎప్పుడొస్తుందనేది కాలమే నిర్ణయించాలి.

Most Read Articles

English summary
When change is common in everything in this technological world, cars too have such environments. The car makers are racing against the technological advancements to switch over the methodology. Much akin to facilities provided in a mobile phone or any electronics gadget, cars too are prone to be fit with sophisticated technology.
Story first published: Tuesday, February 1, 2011, 16:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X