కారు లోపలి వాతావరణాన్ని చల్లబరిచే సోలార్ కూలర్

సూర్యరశ్మి వల్లే కారు వేడెక్కుతుంది, మరి అదే సూర్యరశ్మితో కారును చల్లబరచడం ఎలా అనుకుంటున్నారా..? ప్రత్యామ్నాయ ఇంధనాలలో సౌరశక్తి (సోలార్ ఎనర్జీ) కూడా ఒకటని మనకు తెలుసు. ప్రకృతి సిద్ధంగా లభించే సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చుకొని పనిచేసే ఓ ఆటోమేటిక్ "సోలార్ పవర్ ఆటో కూలర్"ని కార్లో అమర్చుకుంటే.. భగ్గున మండే ఎండల్లో కూడా కారు లోపలి వాతావరణం చల్లగా ఉంచుకోవచ్చు. కారు అద్దానికి (ముందు భాగాన కానీ, వెనుక భాగాన కానీ) దీనిని అమర్చుకోవచ్చు. దీనిని బిగించండం కూడా చాలా సులువు. అంతేకాకుండా.. అవసరం లేదనుకున్నప్పుడు ఈ పరికరాన్ని సులువుగా తీసేయవచ్చు.
ఈ పరికరానికి వెనుక భాగాన సోలార్ ప్లేట్, ముందు భాగాన కూలింగ్ ఫ్యాన్‌లు ఉంటాయి. కారు అద్దంపై పడిన సూర్యర్శిని సోలార్ ప్లేట్ సంగ్రహించడం వల్ల ఏర్పడే సౌరశక్తితో లోపల ఉండే కూలింగ్ ఫ్యాన్ తిరగడం ప్రారంభించి కారు లోపలి వాతావరణాన్ని చల్లబరుస్తుంది.


Click it and Unblock the Notifications








