మీ మహీంద్రా వాహనాన్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోండి

అదెలా అనుకుంటున్నారా.. చాలా సింపుల్..!! ఇందుకోసం మీరు ఏదైనా ప్రవేట్ కార్ డెకార్ షోరూమ్‌కి వెళ్లి నాణ్యతలేని ఉత్పత్తులను అమర్చుకొని జేబులకు చిల్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహీంద్రా అండ్ మహీంద్రానే ఈ కస్టమ్ బిల్ట్ ఫీచర్లను ప్రత్యేకంగా అందిస్తుంది. సాధారణంగా మహీంద్రా వాహనాల కన్నా విభిన్నంగా ఉండేలా మీ వాహనాలను తీర్చిదిద్ది, చూపరులచే శభాష్ అనిపించుకునేలా మీ వాహనాలు మార్చుకోవచ్చు.
స్కార్పియో, బొలెరో, లోగాన్, థార్, మహీంద్రా మేజర్, జైలో వంటి మహీంద్రా వాహనాలను వినియోగదారులకు నచ్చిన విధంగా కంపెనీ మార్చి అదనపు హంగులు జోడించి అందిస్తుంది. ఈ కస్టమైజేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్‌ను కానీ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ "మహీంద్రా-కస్టమైజేషన్ డాట్ కామ్"ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








