ఫోక్స్‌వ్యాగన్ పోలో కోసం ఆడి స్టైల్ హెడ్‌లైట్స్..!

VW Polo LED
ఆడి కార్లు అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేవి దాని ఎల్‌ఈడి హెడ్‌లైట్స్. డే టైమ్ రన్నింగ్ లైట్స్‌గా పిలిచే ఈ ఎల్‌ఈడి లైట్లు ఆడి కార్లకు ఓ ప్రత్యేక లుక్‌ను ఇస్తాయి. మరి మీ కారుకు కూడా ఆడి స్టయిల్ హెడ్‌ల్యాంప్ లుక్‌ను ఇవ్వాలనుకుంటున్నారా..? మీరు గనుక ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారును ఉపయోగిస్తూ ఉండి, మీ కారుకు ఆడి స్టయిల్ లుక్ ఇవ్వాలనుంకుంటే డెక్టేన్ ఎల్ఈడి రన్నింగ్ హెడ్‌లైట్లను అమర్చుకోవడమే.

ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్లతో కూడిన పోలో కారును ఆస్ట్రియాలో విడుదల చేసింది. ఈ మోడల్‌కు ఎల్ఈడి లైట్లను అమర్చడంతో మరింత ఆకర్షనీయంగా తయారైంది. దీంతో చాలా మంది తమ పోలో కార్లకు కూడా ఎల్ఈడి లైట్లను అమర్చుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తుండటంతో యూరప్‌కు చెందిన విడిభాగాల సంస్థ డిక్టేనే ఈ లైట్లను ఆవిష్కరించింది.

ప్రత్యేకించి ఫోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ కోసం తయారు చేసిన ఈ ఎల్ఈడి లైట్లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. వీటి ధర 249 యూరోలు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.17,000. దీనికి పన్నులు, షిప్పింగ్ కాస్ట్ అధనం. మరి మీ పోలో కారుకు కూడా ఆడి కారు లుక్ ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే, వెంటనే డెక్టేన్ సైట్‌లోకి లాగిన్ అయి మీ ఆర్డర్‌ను బుక్‌చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, November 14, 2011, 15:37 [IST]
English summary
Dectane, an European auto parts maker has now launched a new headlight design for the Volkswagen Polo. This headlight has LED running lights akin to the ones used in the Audi R8 sports car. The headlight will add to the Polo's glamour. They make your car look like an Audi without the actual cost of buying one.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+