టైమ్స్ ఆటో షోలో ఆకట్టుకున్న డీజిల్ బైక్

Diesel Bike
గడచిన జూన్‌లో వన్ఇండియా ఆటోమొబైల్ లీటరు డీజిల్‌కు 110 కిలోమీటర్ల మైలేజీనిచ్చే డీజిల్ బైక్ గురించి ఓ కథన ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే ముగిసిన టైమ్స్ ఆటో షోలో బెంగుళూరుకు చెందిన ఎమ్ఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకు చెందిన విద్యార్థులు తాము రూపొందించిన డీజిల్ బైక్‌ను ప్రదర్శనకు ఉంచారు.

టైమ్స్ ఆటో షోలో ఈ డీజిల్ బైక్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, చూపరలను ఆకట్టుకుంది. డాక్టర్ ఎస్.వి. ప్రకాష్ ఆధ్వర్యంలో ఔత్సాహిక ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ డీజిల్‌ బైక్‌ను సృష్టించారు. కైనటిక్ బ్లేజ్‌ స్కూటర్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ ఇంజన్‌ను బిగించి, ఇంజన్‌లో అవసరమైన మరమ్మత్తులను చేసి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో దీన్ని డీజిల్ బైక్‌గా తీర్చిదిద్దారు. ఇతర డీజిల్ ఇంజన్‌లతో పోలిస్తే ఇది వెలువరించే కాలుష్యం కూడా తక్కువ.

విద్యార్థులు బెంగుళూరు మరియు కొయంబత్తూరులోని వివిధ వర్క్‌షాపులలో నాలుగు నెలల పాటు శ్రమించి ఈ బైక్‌ను రూపొందించారు. 350 సీసీ ఇంజన్‌ను 200 సీసీకి కుదించడమే కాకండా, ఫ్లైవీల్ బరువును 7 కేజీలకు తగ్గించి, హార్స్‌పవర్‌ను కూడా 6.5 బిహెచ్‌పిల నుంచి 3.5 బిహెచ్‌పిలకు తగ్గించారు. దీన్ని రూపొందించడానికి తమకు రూ. 70,000 ఖర్చు అయిందని విద్యార్థులు తెలిపారు.

ఈ డీజిల్‌ బైక్‌ను పూర్తిస్థాయిలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసినట్లయితే దీని ధర రూ.55,000 నుంచి రూ.60,000 వరకూ ఉంటుందని ఓ విద్యార్థి చెప్పాడు. ఈ బైక్‌పై రన్నింగ్ కాస్ట్ ప్రతి లీటరుకు 40 పైసలుగా ఉంటుందని, అదే సాధారణ పెట్రోల్ బైక్ ప్రతి లీటరుకు రూ. 1.40 పైసలుగా ఉంటుందని, ఇది లీటరుకు సుమారు 110 కి.మీ. మైలేజీనిస్తుందని వారు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2011, 16:14 [IST]
English summary
Talented engineering students from Bangalore's M S Ramaiah Institute of Technology have developed a diesel bike that gives a mileage of 110kmpl. The Diesel bike was displayed at TIMES Auto Show in Palace Grounds, Bangalore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+