100 సీసీ 150 సీసీకు మధ్యలో 'డిస్కవర్ 125 సీసీ' బైక్..!

Bajaj Discover
త్వరలోనే హీరో హోండా రెండు కంపెనీలుగా విడిపోనున్న తరుణంలో.. ద్విచక్ర వాహన రంగంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు బజాజ్ ఆటో వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం దేశీయ రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉన్న బజాజ్, హీరో హోండాకు గట్టి పోటీ ఇచ్చేందుకు తమ ఉత్పత్తుల శ్రేణిని శరవేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల బజాజ్ అందిస్తున్న డిస్కవర్ మోడల్‌లో 100 సీసీ వేరియంట్‌ను తొలిసారిగా ఆటో కలర్ ఛేంజ్ అనే అత్యాధునిక ఫీచర్‌తో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే.. ఇప్పుడు బజాజ్ ఆటో తాజాగా డిస్కవర్ మోడల్‍‌లో సరికొత్త 125 సీసీ వేరియంట్‌ను కూడా విడుదల చేయాలని భావిస్తోంది. డిస్కవర్ మోడల్ నెలసరి విక్రయాలను 1.25 లక్షల మోటార్‌సైకిళ్ల నుంచి 1.65 లక్షల మోటార్‌సైకిళ్లకు పెంచుకునేందుకు గానూ వచ్చే నెలలో బజాజ్ డిస్కవర్ 125 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం బజాజ్ మొత్తం విక్రయాలలో సగటున 85,000 డిస్కవర్ మోటార్‌సైకిళ్లు ఉండగా.. 40,000 డిస్కవర్ 150 సీసీ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి.

మైలేజ్ కోరుకునే వినియోగదారుల కోసం బజాజ్ ఆటో డిస్కవర్ 100 సీసీని అందిస్తుండగా.. చౌక ధరలో 150సీసీ బైక్ కావాలనుకునే వారికోసం డిస్కవర్ 150 సీసీని అందిస్తుంది. అయితే అటు 100సీసీకు ఇటు వంటి 150 సీసీకు మధ్య పవర్ మరియు మైలేజ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని బజాజ్ డిస్కవర్ 125 సీసీను కంపెనీ విడుదల చేయనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్ వెర్షన్ రూ. 44,000 గానూ, డిస్క్ బ్రేక్ వెర్షన్ రూ. 47,000 గాను ఉండవచ్చునని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, March 8, 2011, 13:46 [IST]
English summary
The long tradition of the Indian two wheeler market has seen many ebb and low with launches of scooters and motorcycles. The latest trend is the dominating force of 100cc bikes from top manufacturers like Hero Honda, Bajaj, Honda and TVS. Of these, Hero Honda tops the list while it is closely followed by Bajaj Auto in terms of market penetration.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+