వచ్చే ఏడాది వరకూ కార్లు కొనద్దు, ఎందుకంటే...?

Car Buying Tips
మరికొద్ది రోజుల్లో పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం రాబోతుంది. ఇప్పటికే దీపావళి, దసరా పండుగ ఆఫర్లు అంటూ కంపెనీ గడచిన నెలలో అమ్మకాలను పెంచుకునేందుకు వివిధ ఆఫర్లను ప్రకటించారు. అయినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆశించిన రీతిలో సాగలేదు. ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా పండుగ సీజన్‌లో అమ్మకాలు జోరందుకోవచ్చనే నమ్మకంతో వాహనాలను భారీగా స్టాక్‌ చేసి పెట్టుకున్నాయి.

అయితే, ఇప్పుడు తాజాగా.. ఇయరెండ్ (సంవత్సరం ముంగిపు) సేల్స్, స్టాక్ క్లియరింగ్ సేల్స్ అంటూ.. కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం పెట్రోల్ కార్లపైనే ఆఫర్లు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా గడచిన కొద్ది నెలలు పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా కొనుగోలుదారులు పెట్రోల్ కార్ల జోలికి వెళ్లడం లేదు, ఫలితంగా ఈ మోడళ్ల స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది.

ప్రస్తుత సీజన్‌లో వాహనాలను కొనుగోలు చేసే ముందు ప్రధానంగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చే ఏడాది ఆరంభంలో వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రస్తుతం వాహనాన్ని కొనుగోలు చేయడానికి ధరలో ఖచ్ఛితం తేడా ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆఫర్ కింద ఓ కారును కేవలం రూ.2.5 లక్షలకే కొనుగోలు చేసినట్లయితే వచ్చే ఏడాది దీని కాస్తతంత అధికమైన ఆశ్చర్యం లేదు.

మీరు వాహనం యొక్క రీసేల్ గురించి ఆలోచించినట్లయితే, ప్రస్తుత సీజన్‌లో కారును కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే, జనవరి 2011లో వాహనాన్ని కొనుగోలు చేసినా డిసెంబర్ 2011లో వాహనాన్ని కొనుగోలు చేసిన మోడల్ ఇయర్ మాత్రం 2011 గానే ఉంటుంది. కాబట్టి, ఇప్పుడు వాహనాన్ని కొనుగోలు చేసి సమీప భవిష్యత్తులో రీసేల్‌కు ఉంచినట్లయితే కారు మోడల్ ఇయర్‌ను బట్టి దీని వెల తగ్గే అవకాశం ఉంది.

వాహనాల రీసేల్ విషయంలో మోడల్ ఇయర్ అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది వాహన విలువను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఓ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్‌కి వెళ్లి 2008 మోడల్ స్విఫ్ట్ కారు ధరను, 2009 మోడల్ స్విఫ్ట్ కారు ధరలను గమనిస్తే వీటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం మోడల్ ఇయర్. కాబట్టి రీసేల్ వ్యాల్యూ గురించి ఆలోచించే వారు ప్రస్తుత సీజన్‌లో వాహనాన్ని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2011, 15:03 [IST]
English summary
Carmakers are offering huge discounts during this festive season. There are additional offers such as free insurance, extended warranty and free accessories too. But are you really in a hurry to buy a car this year? The reason why we are asking this question is because, while there are some advantages buying cars when such discounts are available, there are some factors that may have a negative impact too.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+