భారత మార్కెట్లోకి మరో డ్యుకాటి సూపర్‌బైక్ 'డయావెల్'

ప్రతి రైడింగ్ మోడ్‌ను వివిధ రైడింగ్ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దారు. రాత్రివేళ ప్రయాణాల్లో అత్యుత్తమ కాంతిని ఇచ్చేందుకు గానూ దీని హెడ్‌లైట్‌ను ఎల్ఈడి లైట్లతో రూపొందించారు. దీని బరువు సాధారణ మోటార్‌సైకిల్ కన్నా రెండింతలు ఎక్కువ. ఇక దీని ధర విషయానికి వస్తే.. ప్రారంభ మోడల్ ధర రూ. 17.06 లక్షలు (ఎక్స్-షోరూమ్), కార్బన్ వేరియంట్ ధర రూ. 22.06 లక్షలు మరియు టాప్ ఎండ్ కార్బన్ రెడ్ వేరియంట్ డ్యుకాటి డయావెల్ సూపర్‌బైక్ ధర రూ. 22.43 లక్షలుగా ఉంది. ఈ బైక్ విడుదలతో పాటుగా డ్యుకాటి బెంగుళూరులోని లావెల్లే రోడ్ తమ షోరూమ్‌ను ప్రారంభించింది. కాగా.. డ్యుకాటికి భారత్‌లో ఇది నాలుగో షోరూమ్ కావడం విషేశం.


Click it and Unblock the Notifications








