బెంగుళూరులో డ్యుకాటి బైక్స్ నాలుగో డీలర్‌షిప్ కేంద్రం

ప్రస్తుతం డ్యుకాటి నుంచి డ్యుకాటి 1198ఎస్‌పి, డ్యుకాటి 848 ఈవో, డ్యుకాటి డయావెల్ వంటి ప్రముఖ మోడళ్లతో పాటు మరికొన్ని ఇతర మోడళ్లను కంపెనీ అందిస్తుంది. వినియోగదారులకు డిమాండును తీర్చడంతో పాటు వారికి మరింత చేరువయ్యేందుకు ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ షోరూమ్‌లో రూ. 7.95 లక్షలు మొదలుకొని రూ. 20.45 లక్షల వరకూ వెల కలిగిన అత్యంత విలాసవంతమైన (సూపర్ లగ్జరీ) మోటార్ సైకిళ్లు అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








