సౌరశక్తితో నడిచే బైక్‌ను రూపొందించిన ఎలక్ట్రీషియన్

ఇందులో ఉపయోగించే బ్యాటరీ సౌరశక్తి ద్వారా చార్జి అవుతూ ఉంటుంది. దీని బ్యాటరీ ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ అయితే 50-60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే సూర్యరశ్మిలో ప్రయాణిస్తే దీనిపై సగటున రోజుకు 200 కి.మీ. నుంచి 250 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. మరి ఎండ లేకపోతే పరిస్థితి ఏంటనే కదా మీ సందేహం.. వాతావరణ పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో దీనికి అమర్చబడిన మల్టీపర్పస్ సాకెట్ ద్వారా ఎక్కడైనా కరెంట్ ద్వారా దీనిని చార్జ్ చేసుకోవచ్చు.
నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరల బాధ నుంచి తప్పించుకోవాలంటే మనమూ ప్రత్యమ్నాయ ఇంధనాలతో నడిచే ఇలాంటి వాహనాలను కొనక తప్పదు మరి. ఇక దీని ధర అంటారా పెద్ద ఎక్కువేమీ కాదులెండి. ప్రస్తుతం ఇది రూ. 26,000గా ఉంది. అధిక సంఖ్యలో గనుక ఉత్పత్తిని చేపడితే దీనిని రూ. 16,000 లకే అందిస్తామని పఠాన్ చెబుతున్నాడు.
గతంలో మన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఓ బైక్‌ను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ఇంజనీరిగ్ విద్యార్థులు రూపొందించారు. పెట్రోలు, డీజిల్ అవసరం లేకుండా పర్యావరణానికి ఏమాత్రం హానికలిగించని విధంగా దీనిని తయారు చేశారు. ఇంకా ఈ బైక్‌పై రైడింగ్ మాత్రమే కాకుండా ఇంట్లోని ఫ్యానులు, బల్బులు కూడా ఈ బైక్ సహాయంతో ఉపయోగించుకోవచ్చు. అందుకే ఈ బైక్‌కు వాళ్లు "మల్టిపర్పస్ సోలార్ బైక్" అని పేరు పెట్టారు. 150కిలోల బరువును మోయడంతో పాటు గంటకు 35-45 కి.మీ వేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీని తయారీకి మూడు నెలల సమయం పట్టిందని, ఇందుకు దాదాపు 47వేల రూపాయలు ఖర్చయిందని వారు తెలిపారు.


Click it and Unblock the Notifications








