బుల్లెట్ బైకుల తయారీ కోసం గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్స్ ఏర్పాటు: ఐషర్

ప్రస్తుతం ద్విచక్ర వాహన విభాగంలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (బుల్లెట్, థండర్‌బర్డ్ వంటి హై-పవర్ బైకులను తయారు చేసే బ్రాండ్) పేరుతో ఐషర్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం బుల్లెట్ బైకును సొంతం చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకున్న తర్వాత కనీసం ఆరు నెలలు వేచిఉండాల్సిన పరిస్థితి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు భారత్‌లో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ ఆర్ఎల్ రవిచంద్రన్ తెలిపారు. అయితే ఈ ప్లాంటుకు సంబంధించిన ఉత్పత్తి సామర్ధ్యం, పెట్టుబడులు వంటి విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
కాగా.. ఈ ప్లాంటును తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్మించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం చెన్నయ్ ప్లాంటు రూ. 25 కోట్ల పెట్టుబడితో 20 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి 2011) నాటికి 70,000 యూనిట్లను విక్రయించి రూ. 500 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఈ విభాగం నుంచి అమెరికా, యూరప్ దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు కూడా తమ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. మొత్తం నికర అమ్మకాలలో ఈ విభాగం నుంచి దాదాపు ఏడు శాతం ఎగుమతులను చేయనుంది.


Click it and Unblock the Notifications








