బుల్లెట్ బైకుల తయారీ కోసం గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్స్ ఏర్పాటు: ఐషర్

Royal Enfield
బుల్లెట్ బైకుల గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. దేశీయ మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు, హైపవర్ బైకులు వచ్చినప్పటికీ బుల్లెట్ మాత్రం తన స్థానాన్ని ఇప్పటికీ అలానే కొనసాగిస్తుంది. ఒకప్పుడు మధ్య వయస్కులు, సంపన్నులు మాత్రమే వాడే ఈ బైకులు ప్రస్తుతం యువతను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లెట్ బైకులను భారత్‌లో తయారు చేయడానికి ఐషర్ సంస్థ సన్నాహాలు చేస్తుంది. ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌తో పాటు ఇతర బైకులను పర్యావరణానికి చేటు వాటిళ్లకుండా ఉండేలా గ్రీన్‌ఫీల్డ్ ఫెసిలిటీతో రూపొందించడానికి ఐషర్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ప్రస్తుతం ద్విచక్ర వాహన విభాగంలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' (బుల్లెట్, థండర్‌బర్డ్ వంటి హై-పవర్ బైకులను తయారు చేసే బ్రాండ్) పేరుతో ఐషర్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం బుల్లెట్ బైకును సొంతం చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకున్న తర్వాత కనీసం ఆరు నెలలు వేచిఉండాల్సిన పరిస్థితి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు భారత్‌లో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ ఆర్ఎల్ రవిచంద్రన్ తెలిపారు. అయితే ఈ ప్లాంటుకు సంబంధించిన ఉత్పత్తి సామర్ధ్యం, పెట్టుబడులు వంటి విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

కాగా.. ఈ ప్లాంటును తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్మించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం చెన్నయ్ ప్లాంటు రూ. 25 కోట్ల పెట్టుబడితో 20 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి 2011) నాటికి 70,000 యూనిట్లను విక్రయించి రూ. 500 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఈ విభాగం నుంచి అమెరికా, యూరప్ దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు కూడా తమ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. మొత్తం నికర అమ్మకాలలో ఈ విభాగం నుంచి దాదాపు ఏడు శాతం ఎగుమతులను చేయనుంది.

Most Read Articles

English summary
The Enfield Bullet and other two wheelers from Eicher may get facelift with the installation of Greenfield facility. This would envisage the company to cater to the needs for another decade, said an official of the company. The two wheeler segment of Eicher operates on Royal Enfield name which makes Bullet, Thunderbird and various range of high-power bikes. The CEO of Royal Enfield revealed that the motive behind installing this facility is to curtail the waiting period, which is currently 6 months.
Story first published: Tuesday, January 25, 2011, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X