ఎలక్ట్రిక్ స్కూటర్లను పునఃప్రవేశపెట్టనున్న టీవీఎస్ కంపెనీ

TVS Teenz
చెన్నయ్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మరోసారి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని చేపట్టనున్నట్లు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని ఆకర్షనీయమైన మోడళ్లతో తిరిగి భారత ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి ప్రవేశించనున్నామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో దాదాపు 50 ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. స్కూటర్లను ఎలక్ట్రిక్ మోడ్‌లో మాత్రమే విడుదల చేస్తామని, ప్రారంభంలో భాగంగా ఇవి లీడ్ యాసిడ్ బ్యాటరీలతో నడుస్థాయని, తర్వాతి కాలంలో వేరే ఇతర ప్రత్యామ్నాయ టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ అధ్యక్షుడు (మార్కెటింగ్) హెచ్ ఎస్ గోయింది తెలిపారు.

కర్ణాటకలోని మైసూరులో ఉన్న టీవీఎస్ ఉత్పత్తి కేంద్రంలో ఈ స్కూటర్లను తయారు చేయనున్నామని ఆయన వెల్లడించారు. భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ గురించి గోయిందిని అడుగగా ఆయన వివరిస్తూ... కొన్ని సంవత్సరాల క్రితం భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేదని, కానీ వెరైటీలు ఎక్కువగా లేని కారణందా తర్వాతి కాలంలో వీటికి డిమాండ్ బాగా తగ్గిపోయిందని, అయితే వీటిపై ఇప్పుడు సబ్సిడీలు కూడా లభిస్తుండటంతో మరోసారి వీటికి భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.

గత ఏప్రిల్ 2008లో టీవీఎస్ మోటార్ కంపెనీ "స్కూటీ టీన్జ్ ఎలక్ట్రిక్" అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కూటర్లు ఏటా దాదాపు 40,000 వరకూ అమ్ముడుకాగలవని కంపెనీ అంచనా వేసింది. కానీ ఇది ఆశించిన రీతిలో మార్కెట్ ఆదరణ పొందలేకపోయింది. దీంతో మే 2009లో స్కూటీ టీన్జ్ ఎలక్ట్రిక్ ఉత్పత్తిని నిలిపివేసింది.

More from DriveSpark

Article Published On: Saturday, March 12, 2011, 15:39 [IST]
English summary
The not-so-passive two wheeler company of India, TVS said it will revive the electric scooters in the next financial year. The move will cover some of the existing models and will find place in new models and the test runs are on with some 50 units spread across the nation, the company’s President for Marketing said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+