హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనుగోలు చేసిన తోలి భారతీయ మహిళ

Harley Davidson
హ్యార్లీ డేవిడ్‌సన్ బైకులంటనే విలాసానికి, వేగానికి పెట్టింది పేరు. అలాంటి బైక్‌లు కొనాలన్నా, నడపాలన్నా గట్స్ కావాలని చెప్పొచ్చు. ఇప్పటి వరకూ ఈ బైక్‌లను హైప్రొఫైల్ వినియోగదారులు అందునా మగవారు మాత్రమే కొనుగోలు చేయడం చూశాం. అయితే రొటీన్‌కు భిన్నంగా, మొట్టమొదటిసారిగా ఓ మహిళ ఈ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెలితే కర్ణాటక రాజధాని బెంగుళూరుకు చెందిన షీజా మాథ్యూస్ అనే 34 మహిళ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

వాస్తవానికి ఆమెకు మోటార్‌సైకిళ్లు నడపడం అంటే బహు సరదా.. ఇప్పటి వరకూ ఆమె తన ఆఫీస్‌కు యమహా 350 సీసీ రాజ్‌దూత్‌ మోటార్‌సైకిల్ వెళ్లేది. అయితే, ఇప్పుడు అది బోర్ కొట్టిందో లేక వెరైటీగా కాస్తంత కొత్తదనం కోరుకుందో తెలియదు కానీ ఏకంగా ఎనిమిది లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి ఓ హ్యార్లీ డేవిడ్‌సన్ 'ఐరన్ 883' మోడల్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఇలా ఓ అమెరికా బైక్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయ మహిళగా షీజా మాథ్యూస్ ప్రజల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఈ విషయాన్ని హ్యార్లీ డేవిడ్‌సన్ ధృవీకరించడంతో సంబరపడిపోతోంది ఈ హెచ్ఆర్ ఉద్యోగి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2011, 13:00 [IST]
English summary
Harley Davidson's first woman buyer in India has emerged from Bangalore. Sheeja Mathews who works as an HR at a MNC has received delivery of a Harley Davidson Iron 863 on Monday. She had placed an order for the American superbike in February. Ms Mathews said although there were several other superbikes available in India, she considered Harley Davidson as the ultimate superbike and always dream of owning one. Harley Davidson entered the India market last year with a product portfolio costing between Rs.5.5 lakhs to 38.66 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+