జర్మనీలో ఈ-బైక్ కాన్సెప్ట్‌ను విడుదల చేసిన ఫోర్డ్

స్త్రీ, పురుషులకు ఇరువురికి సరిపోయే విధంగా ఈ ఈ-బైక్ ఫ్రేమ్‌ను డిజైన్ చేశారు. ఈ-బైక్ బరువును తగ్గించేందుకు గానూ దీని తయారీలో అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌లను ఉపయోగించారు. దీని బరువు సుమారు 5.5 పౌండ్లు. స్టైలిష్ లుక్, కంఫర్ట్ రైడింగ్ కోసం ఇందులో డ్యూయెల్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.
ఈ-బైక్ ముందు చక్రంలో ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీను రెండు చక్రాలకు మధ్య భాగంలో ఉండే బాడీ ఫ్రేమ్‌లో అమర్చబడి ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 53 మైళ్ల వరకూ ప్రయాణించవచ్చు. ఇందులో కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించారు.
అంతేకాకుండా.. మీరు ఎంత గట్టిగా పెడల్ తొక్కుతున్నారో అనే విషయాన్ని ఇది గ్రహించి అంతకు సరిపడా పవర్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. సురక్షితమైన బ్రేకింగ్ కోసం ఈ-బైక్‌లో డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను అమర్చారు. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారంగా పనిచేసే సెన్సార్‌లను అమర్చారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 2 వంటి ఫోన్లకు ఈ సెన్సార్‌లు స్పందిస్తాయి.
ఉదాహరణకు హ్యాండిల్ బార్‌పై ఓ ఆండ్రాయిడ్ ఫోన్‌ను అమర్చినట్లయితే.. వేగం, ప్రయాణించిన దూరం వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకూ టెక్నాలజీ కార్లలో మాత్రమే ఉపయోగించేవారు. ఇంకా ఇందులో 11-స్పీడ్ ఇంటర్నల్ గేర్ హబ్ ఉంటుంది. ఇందులో చైన్‌కు కార్బన్ బెల్ట్‌ను ఉపయోగించారు.
హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లలో కూడా చైన్లకు బదులు కార్బన్ బెల్టులనే ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ ఈ-బైక్ మాత్రమే. ఫోర్డ్ తమ ఈ-బైక్‌ను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదైతేనేం పెట్రోల్ ధరలు మండిపోతున్న ప్రస్తుత రోజుల్లో మనకు ఇలాంటి ఈ-బైక్‌ల అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








