ట్రాఫిక్ జామ్‌ల గురించి మర్చిపోండి: గూగుల్ మ్యాప్స్ ఉందిగా..!!

Traffic Jam
శాన్‌ఫ్రాన్సిస్కో: ట్రాఫిక్ జామ్.. పట్టణాలు, నగరాలను పట్టి పీడిస్తున్న ప్రధాన రవాణ సమస్య. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటే... ఆఫీస్‌కు లేట్, స్కూల్/కాలేజ్‌కు లేట్, ఎగ్జామ్‌కు లేట్, హాస్పిటల్‌కు లేట్ చివరకు గర్ల్ ఫ్రెండ్‌ను కలవడానికి కూడా లేటే. పెద్దవాళ్లు చెప్పిన 'ఆలస్యం, అమృతం, విషం' అనే మాట కొన్ని విషయాల్లో నిజమేమో కానీ, పై విషయాల్లో మాత్రం ఆలస్యం అయితే 'విష'మ పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే. అయితే.. ఇప్పుడు ఈ చిక్కులకు తెరపడనుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గూగుల్ మ్యాప్స్ ఇకపై ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను కూడా అందించనుంది. ఆండ్రాయిడ్ తయారీదారు అయిన అంతర్జాల దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్‌ ద్వారా ఈ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. రూట్ మ్యాప్‌లతో కూడిన ప్రత్యక్ష రవాణా యాత్ర, బయలుదేరు వేళలు, ఆలస్యానికి సంబంధించిన సమాచారం మరియు సర్వీస్ అలెర్ట్స్ వంటి అప్‌డేట్‌లను గూగుల్ మ్యాప్స్ అందిస్తుంది.

గూగుల్ మ్యాప్స్‌లోని ట్రాన్సిస్ట్ స్టేషన్‌పై క్లిక్ చేసిన లేదా ట్రాన్సిస్ట్ రూట్‌ని ప్లాన్ చేసుకున్నా అందుకు సంబంధించిన అలెర్ట్‌లను సర్వీసులను దీని ద్వారా పొందవచ్చునని గూగుల్ తన బ్లాగులో పేర్కొంది. ఇందుకోసం గూగుల్ అమెరికాలోని ట్రాన్సిస్ట్ ఏజెన్సీలతో భాగస్వామ్యంగా ఏర్పడి నాలుగు అమెరికా నగరాలు, పెండు యూరోపియన్ నగరాలకు సంబంధించిన లైవ్ ట్రాన్సిస్ట్ డేటాను పొందనుంది.

మరిన్ని నగరాల్లో ఈ సేవలను అందించేందుకు తమ ట్రాన్సిస్ట్ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. మొబైల్ మరియు కంప్యూటర్ల ద్వారా ఈ లైవ్ ట్రాన్సిస్ట్ అప్‌డేట్‌లను పొందవచ్చు. ఆండ్రాయి 1.6 లేదా అంతకన్నా హైయర్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మొబైల్ ఫోన్లలో ఈ కొత్త గూగుల్ మ్యాప్ సేవలను పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, June 9, 2011, 16:26 [IST]
English summary
The Android maker Google has announced the launch of updates to its popular Google Maps service. The new update will offer live transit updates including route maps, departure times, information on delays and service alerts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+