హైదరాబాద్‌కు విచ్చేసిన హ్యోసంగ్ సూపర్‌బైక్‌లు

ఈ మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్‌లో కంపెనీ ఓ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం గార్వారే మోటార్స్ హ్యోసంగ్ బ్రాండ్‌కు చెందిన, హ్యోసంగ్ జిటి650ఆర్, హ్యోసంగ్ ఎస్‌టి7 మరియు కంపెనీ ఇటీవల విడుదల చేసిన హ్యోసంగ్ జిటి650ఎన్ అనే మూడు సూపర్‌బైక్‌లను దేశీయ విపణిలో అందిస్తుంది.
ఈ మూడు మోడళ్లను గార్వారే మోటార్స్ హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూమ్‌తో దేశవ్యాప్తంగా హ్యోసంగ్ షోరూమ్‌ల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం హ్యోసంగ్ అందిస్తున్న సూపర్‌బైక్‌ల ధరలు రూ.3.87 లక్షల నుండి రూ.5.8 లక్షల వరకూ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








