ఫ్యాట్ బాయ్ స్పెషల్‌ను విడుదల చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హ్యార్లీ డేవిడ్‌సన్ షోరూమ్‌లలో ఫ్యాట్ బాయ్ స్పెషల్ మోటార్‌సైకిల్ లభ్యం కానుంది. ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న హ్యార్లీ డేవిడ్‌సన్ తాజాగా.. కన్జ్యూమర్ ఫైనాన్సింగ్, డీలర్ ఫైనాన్సింగ్, బ్యాంకింగ్ సేవల కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో కూడా చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లను సొంతం చేసుకోవాలనే ఎంతో మంది బైక్ ప్రియుల కలను నిజం చేసినట్లు అవుతుందని హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ ప్రకాష్ తెలిపారు. దేశీయ మార్కెట్లో ఫ్యాట్ బాయ్ స్పెషల్ మోటార్‌సైకిల్ ధర రూ. 19.7 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








