మార్కెట్లో హార్లీ డేవిడ్‌సన్ ఫార్టీ-ఎయిట్ సూపర్‌బైక్ విడుదల

హార్లీ డేవిడ్‌సన్ ఫార్టీ-ఎయిట్ బైకుల బుకింగ్‌లను ఈ నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఐదు డీలర్ల ద్వారా ప్రారంభింస్తామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ప్రస్తుత బడ్జెట్‌లో సవరణల కాణంగా సికెడి యూనిట్లపై అధనపు భారం పడినప్పటికీ.. భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తున్న వాహన ధరులను ఇప్పట్లో పెంచబోమని గత నెలలో కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం హర్యానాలోని అసెంబ్లింగ్ ప్లాంటులో హ్యార్లీ-డేవిడ్‌సన్ 'సూపర్ లో', 'ఐరన్ 883' అనే రెండు బైకులను అసెంబ్లింగ్ చేస్తుంది. వీటి ధరలు రూ. 5.5 లక్షలు (సూపర్ లో), రూ. 6.50 లక్షలు (ఐరన్ 883)గా కంపెనీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








