భారత్‌లోకి ప్రవేశించిన హర్మన్: ఏ.ఆర్. రెహమాన్‌తో దోస్తీ..!

జెబిఎల్, ఏకెజి హర్మన్-కార్డన్ అనే వివిధ బ్రాండ్‌ల పేరుతో ఉత్పత్తులను అందిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్, డైమ్లర్, టొయోటా, ఫియట్ స్పా, జనరల్ మోటార్స్, హ్యుందాయ్, ఫెరారీ మొదలగు కంపెనీలకు హర్మన్ తన ఆడియో సిస్టమ్‌లను సరఫరా చేస్తుంది. అలాగే, ఇండియాలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలకు తమ ఉత్పత్తులు సరఫరా చేయాలని కంపెనీ యోచిస్తోంది.
బోష్, యమహా, పానసోనిక్, బోస్, సోనీ వంటి బ్రాండ్‌లకు హర్మన్ గట్టి పోటీ ఇవ్వనుంది. హర్మన్ బ్రాండ్ అయిన జెబిఎల్ ఇప్పటికే సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. అంతేకాకుండా.. ఏ.ఆర్. రెహమాన్‌తో జెబిఎల్ చిత్రీకరించిన ఓ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను కూడా త్వరలోనే విడుదల చేయనుంది. అంటే, త్వరలో ఇండియన్ కార్లలో కూడా ఈ ప్రీమియం ఆడియో సిస్టమ్‌లు లభ్యం కాబోతున్నాయన్నమాట.


Click it and Unblock the Notifications








