పోటాపోటీ పోరు.. అయినా హీరోదే పైచేయి

అయితే, గడచిన సంవత్సరంతో పోలిస్తే ఈ వృద్ధి కేవలం 1.3 శాతం మాత్రమే. కాగా.. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలం నాటికి కంపెనీ మొత్తం 35.8 లక్ష ద్విచక్ర వాహనాలు విక్రయించి గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇదే కాలానికి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా కేవలం 11 లక్షల యూనిట్లను మాత్రమే విక్రయించి 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
గడచిన ఆర్థిక సంవత్సరంలో హీరో మోటోకార్ప్ మొత్తం 54 లక్షల యూనిట్లను విక్రయించింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 15.5 లక్షల యూనిట్లను విక్రయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 21 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








