హీరో సైకిల్ కొంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ..!

"భారతదేశంలో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు సైకిళ్లను కొనుగోలు చేసే స్థితిలో లేరు. వీరికి సైకిళ్లను కొనుగోలు చేసే శక్తిని అందించేలా రుణాలను కల్పించేందుకు గానూ మేము ఓ మైక్రో ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపాం. ఇప్పుడు మేము వారి జీవితాలకు రక్షణ కల్పించాలనుకుంటున్నామ"ని హీరో సైకిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజాల్ తెలిపారు. ఇన్సూరెన్స్ ఉత్పత్తుల కొరకు తమ కంపెనీ ప్రీమియంలను చెల్లిస్తుందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.."మన దేశంలో వీళ్లు చాలా పేద ప్రజలు. ఈ విషయంలో మేము ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాకపోయినప్పటికీ, పేదలకు ప్రీమియంలను చెల్లించడం కోసం మేము ఏదో ఒకటి చేస్తామ"ని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








