గ్రామీణ ప్రాంతాల్లో మైక్రోఫైనాన్స్ ద్వారా హీరో సైకిల్స్‌కు ఫైనాన్సింగ్

Hero Cycles
గ్రామీణ ప్రాంతాల్లో రుణాలపై పాడి-పశువులను కొనే పద్ధతిని గమనించిన దేశీయ అతిపెద్ద సైకిళ్ల తయారీ సంస్థ "హీరో సైకిల్స్" అదే విధానాన్ని తమ సైకిళ్లకు కూడా వర్తింపచేయాలని భావిస్తోంది. ఇందుకోసం మైక్రోఫైనాన్స్ సంస్థలతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకొని పల్లె వాసులకు తక్కువ ధర వడ్డీకే రుణాలపై సైకిళ్లను అందించి కంపెనీ రూరల్ విక్రయాలను పెంచుకోవాలని హీరో భావిస్తోంది. కంపెనీ తొలుత ఈ ప్రణాళికను ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించనుంది. ఇది గనుక విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫైనాన్స్ ద్వారా సైకిళ్లను విక్రయిస్తామని హీరో సైకిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజాల్ పేర్కొన్నారు.

పల్లె వాసుల నెలసరి ఆదాయం తక్కువగా ఉండటం వల్ల వారు ఒక్కసారిగా రూ. 3,000 వెచ్చించి సైకిల్‌ను కొనుగోలు చేయాలంటే కష్టం కాబట్టి ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని, దీని ద్వారా రుణగ్రస్తులు నెలకు/వారానికి విడతల వారీగా కొంత మొత్తాన్ని చెల్లించడం సులువుగా ఉంటుందని, వారి రోజూవారీ జీవన కార్యకలాపాలకు సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భారత్‌లో సైకిళ్ల వినియోగం భారీగా తగ్గిపోయిందని, కేవలం గ్రామీణ ప్రాంతాలనే కాకుండా.. చిన్నపిల్లలు, ప్రిమీయం సైకిళ్లను ఇష్టపడే వారిని కూడా దృష్టిలో ఉంచుకొని మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పంకజ్ ముంజాల్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Monday, May 9, 2011, 13:07 [IST]
English summary
The world's largest bicycle maker 'Hero Cycles Ltd' is planning to sell bicycles in villages via financing. Inspired by purchases of buffaloes in villages through financing, Hero Cycles is looking to replicate the same for its products through micro finance firms to boost its rural sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+