అమెరికా బ్రిటన్ వంటి దేశాలకు ఎగమతి కానున్న హీరో సైకిళ్లు

"ప్రస్తుతం హీరో సైకిల్స్ పూర్తిగా కొత్త రేంజ్ ప్రీమియం బ్రాండ్స్‌పై పనిచేస్తోంది. చిన్న పిల్లలకు మొదలుకొని అన్ని వర్గాల వారికి సంబంధించి ఇవి ఉంటాయి. నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో ఈ కొత్త ప్రీమియం బ్రాండ్‌లను పరిచయం చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నామ"ని హీరో సైకిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ముంజాల్ తెలిపారు.
ప్రీమియం బ్రాండ్ సైకిళ్ల తయారీ కోసం హీరో సైకిల్స్ విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే, సదరు భాగస్వాములు ఎవరనే విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం కంపెనీ నిరాకరించింది. ఈ ప్రీమియం సైకిళ్లను విక్రయించేందుకు వీటి కోసం ప్రత్యేకంగా అవుట్‌లెట్లను కూడా ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. అంటే.. ఇన్ని సంవత్సరాలుగా మన హాట్ ఫేవరేట్‌గా ఉన్న హీరో సైకిళ్లు విదేశాల్లో హల్ చల్ చేయనున్నాయన్నమాట. మరి హీరో సైకిళ్లా .. మజాకానా..!


Click it and Unblock the Notifications








