50 లక్షల మార్కు దాటిన హీరో హోండా విక్రయాలు

ఒక్క మార్చి నెలలోనే కంపెనీ 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అలాగే ఈ ఏడాదిలో ఏడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశీయ స్కూటర్ మార్కెట్‌లో తన పరిమితి పెంచుకున్నామని, అలాగే హాకీ, క్రికెట్ తదితర క్రీడలకు, కామన్వెల్త్ గేమ్స్‌కు తన సౌజన్యాన్ని కొనసాగించామని హీరో హోండా మేనేజింగ్ డైరక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ తెలిపారు. ఈ ఏడాదిలో ఎకనామిక్ టైమ్స్ జిగ్‌వీల్స్ కార్ & బైక్ అవార్డ్స్ విభాగంలో 'బైక్ మాన్యుఫాక్చరర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా సొంతం చేసుకున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








