నాలుగో ప్లాంటు వివరాలను వెల్లడించనున్న హీరో హోండా

"2012-13 నాటికి ఖచ్చితంగా మాకు నాలుగో ప్లాంటు కావాలి. వచ్చే కొద్ది వారాల్లో నెలల్లో నాలుగో ప్లాంటు గురించి మాట్లాడుతాం" అని హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం, పెట్టుబడి వంటి విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని, ప్రస్తుతం ఈ విషయంలో తాము తుది దశలో ఉన్నామని దువా తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 800 కోట్ల క్యాపెక్స్ (నిధుల)ను కేటాయిస్తున్నామని, ఈ మొత్తం మెజారిటీ నిధులను నాలుగో ప్లాంటు ఏర్పాటు కోసం ఉపయోగిస్తామని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కంపెనీ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జపాన్ భాగస్వామి హోండా మోటార్స్ నుంచి విడిపోయిన తర్వాత మార్కెట్లో తన స్థిరత్వాన్ని నింపుకునేందుకు కంపెనీ భారీ కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై కంపెనీ దృష్టి సారించింది.


Click it and Unblock the Notifications








