హీరో మోటోకార్ప్ లిమిటెగా మారిన హీరో హోండా

Hero Honda Passion
ముందు నుంచి చెప్పుకున్నట్లు గానే దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ తన పేరును హీరో మోటోకార్ప్ లిమిటెడ్‌గా మార్చుకుంది. విక్రయాల పరంగా ప్రపంచపు నెంబర్ వన్ కంపెనీగా ఉన్న హీరో హోండా పేరును మార్చేందుకు శుక్రవారం షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని తుది మార్పుల కోసం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు పంపడం జరుగుతుంది. 27 ఏళ్ల క్రితం జపాన్‌కు చెందిన హోండా మోటార్స్ మరియు భారత్‌కు చెందిన ముంజాల్ ప్రమోట్ చేసిన హీరో గ్రూపులు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ద్విచక్ర వాహన మార్కెట్‌ను తిరుగులేకుండా ఏలిన సంగతి మన అందరికీ తెలిసిందే.

దేశం మొత్తం మీద సగానికి పైగా మార్కెట్ వాటా హీరో హోండా కంపెనీదే. ఈ జాయింట్ వెంచర్ గత ఏడాది డిసెంబర్‌ నెలలో రెండు భాగాలుగా విడిపోయింది. అయితే, ప్రస్తుతం హీరో గ్రూపు, హోండా మోటార్స్‌కు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. 2014 వరకూ హోండా పేరును హీరో గ్రూప్ ఉపయోగించుకోవచ్చు. హీరో గ్రూపు తమ ఉత్పత్తులను లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తుండటంతో అక్కడి మార్కెట్లను ఆకర్షించే విధంగా బ్రాండ్ లోగో, నేమ్‌ను డిజైన్ చేయడానికి లండన్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ డిజైనింగ్ సంస్థ వోల్ఫో ఓలిన్స్‌ను ఆశ్రయించిన విషయం విదితమే.

More from DriveSpark

Article Published On: Saturday, June 18, 2011, 10:28 [IST]
English summary
The world's largest two-wheeler company by volume, Hero Honda Motors Ltd shareholders agrees to change its corporate name as Hero MotoCorp Ltd. The shareholders' approval will now be forwarded to the Registrar of Companies for final changes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+