బ్రాండ్ పొజిషన్ కోసం లా & కెన్నెత్‌తో చేతులు కలిపిన హీరో హోండా

Hero Honda
భారత అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ (హెచ్‌హెచ్ఎమ్ఎల్), జపాన్ ఆటో దిగ్గజం హోండా నుంచి విడిపోయిన తర్వాత కొత్త బ్రాండ్ కోసం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే లా అండ్ కెన్నెత్ (L&K) సంస్థతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు హీరో హోండా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం.. లా అండ్ కెన్నెత్ సంస్థ హీరో హోండా కోసం ఓ సరికొత్త బ్రాండ్‌ను రూపొందించడంతో పాటు ఆ బ్రాండ్‌కు విస్తృతమైన ప్రచారాన్ని కల్పించనున్నట్లు హెచ్‌హెచ్ఎమ్ఎల్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనీలు దువా చెప్పారు.

ఈ విషయంలో ఇప్పటికే వోల్ఫో వోలిన్స్‌తో కూడా హీరో హోండా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. బ్రాండ్ డెవలప్‌మెంట్, బ్రాండ్ క్యాంపైన్‌లలో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఏ క్రియేటివ్ ఏజెన్సీకైనా ఇది జీవితలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశమని, ఈ అవకాశం తమకు రావడం ఎంతో గర్వంగా ఉందని హీరో హోండా క్రియేటివ్ పార్ట్‌నర్‌గా ఎన్నికైన లా అండ్ కెన్నత్ చైర్మన్ ప్రవీణ్ కెన్నత్ చెప్పారు. కాగా.. జపాన్‌కు చెందిన హోండా కంపెనీతో కలసి భారత్‌కు చెందిన హీరో గ్రూప్ ఏర్పాటు చేసిన హీరో హోండా జాయింట్ వెంచర్‌లో హోండాకు ఉన్న 26 శాతం వాటాను హీరో గ్రూప్ రూ. 3,841.83 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Monday, May 2, 2011, 12:31 [IST]
English summary
Country's largest two-wheeler maker Hero Honda hires Law & Kenneth (L&K) as a creative partner to launch and establish a new brand for the company after Honda's exit. L&K's appointment follows the hiring of international brand and innovation specialist, Wolff Olins by HHML to work on its new brand identity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+