సాంకేతిక భాగస్వామి కోసం వేట తీవ్రతరం చేసిన హీరో హోండా

ఇది తమ స్వంత ఆర్ అండ్ డి కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఒక చక్కటి అవకాశమని హీరో హోండా మోటార్స్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా వెల్లడించారు. సాంకేతిక సంబంధ పరాక్రమాన్ని నిర్మించుకునేందుకు కంపెనీ దృష్టి సారిస్తుందని, ఇందుకు మరిన్ని పెట్టుబడులను వెచ్చించేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఆర్ అండ్ డి కోసం కంపెనీ ఇప్పటికే నియామకాలు చేపట్టిందని, భవిష్యత్తులో మరింత మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంటి టెక్నాలజీలు ఉన్నాయని, టెక్నాజీలను కొనుగోలు చేసేందుకు సప్లయర్స్, పార్ట్‌నర్స్ మరియు సంస్థలను పరిశీలిస్తున్నామని దువా తెలిపారు.


Click it and Unblock the Notifications








