భారత్‌లో మొట్టమొదటి డర్ట్ బైక్‌ను ప్రవేశపెట్టనున్న హీరో హోండా!?

అయితే ఇప్పటికే గతంలో దాదాపు ఒక దశాబ్ధం క్రితం బజాజ్ ఆటో రెండు విధాలుగా ఉపయోగపడే (డ్యూయెల్ పర్పస్) తమ 'కవాసకి బజాజ్ ఎండ్యురో ఎస్ఎక్స్' మోటార్‌సైకిల్‌ను ఇక్కడి మార్కెట్లో విక్రయించడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పడు తాజాగా హీరో హోండా ఈ విభాగంపై కన్నేసింది. జపాన్ భాగస్వామి నుంచి విడిపోయిన తర్వాత మార్కెట్లో తన స్థానాన్ని నిలుపుకునేందుకు హీరో హోండా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదీ ఒక భాగం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో దాదాపు అన్ని సెగ్మెంట్లు ఉన్నాయి. కానీ డర్ట్ బైక్‌ల సెగ్మెంట్ మాత్రం లేదు. దీంతో ఈ విభాగంలో కూడా తన సత్తా ఏంటో చూపించాలని హీరో హోండా భావిస్తోంది. ఈ నేపథ్యంలో 180సీసీ, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలిగిన ఓ డర్ట్ బైక్‌ను సికెడి రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి గుర్గాన్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేసి దేశీయ మార్కెట్లో విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ 180 సీసీ డర్ట్ బైక్‌కు సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీ మాజీ జపాన్ భాగస్వామి అయిన హోండా అందించే అవకాశం ఉంది. ఎందుకంటే, కొత్త లైసెన్సు ఒప్పందం ప్రకారం జూన్ 2014 వరకూ హోండా టెక్నాలజీని హీరో హోండా కంపెనీ ప్రస్తుతం ఉన్న మోడళ్లు, అలాగే కొత్త మోడళ్ల అభివృద్ధిలో వినియోగించుకోవచ్చు. హోండా విదేశీ మార్కెట్లలో ఇప్పటికే 'హోండా సిఆర్ఎఫ్150' అనే ఆఫ్‌రోడ్ బైక్‌ను అందిస్తోంది. మరో వైపు బజాజ్ కూడా కెటిఎస్ సంస్థతో చేతులు కలిపి "బజాజ్ కెటిఎమ్ డ్యూక్" అనే ఓ ఆఫ్-రోడ్ బైక్‌ను భారత్‌కు పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.3 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








