అప్‌గ్రేడెడ్ సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌ను విడుదల చేసిన హీరో హోండా

CBZ
హీరో హోండా అందిస్తున్న స్పోర్ట్స్ వేరియంట్ మోటార్‌సైకిల్ "సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్"ను కంపెనీ అప్‌గ్రేడ్ చేసి తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్పోర్ట్స్ బైక్స్ సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తామని బజాజ్ ప్రకటించిన మరుసటి రోజునే హీరో హోండా ఈ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. అయితే సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌‌లో మెకానికల్, పెర్ఫామెన్స్‌ల పరంగా ఎలాంటి మార్పులు లేదు. కానీ సరికొత్త లుక్, అదనపు ఫీచర్లను జోడించి ఈ స్పోర్ట్స్ బైక్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దారు. 149.2 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది 14.4 పిఎస్‌ల శక్తిని, 12.80 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌లో కంపెనీ చేసిన మార్పులు:

1. డిజిటల్ స్పీడోమీటర్ - బైకు ప్రయాణించే వేగాన్ని, ప్రయాణించిన కిలో మీటర్ల దూరాన్ని లెక్కించి డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది.

2. అడ్వాన్స్‌డ్ ఇగ్నిషన్ కీ షట్టర్ - వర్షాకాలంలో బైక్ ఇగ్నిషన్ సిస్టమ్‌లోకి నీరు ప్రవేశించకుండా, అలాగే దుమ్ము, ధూళి చేరకుండా ఉండేలా ఏర్పాటు చేయబడిన కీ షట్టర్.

3. సరికొత్త కలర్ మరియు లుక్ - సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌ బైక్.. స్పోర్ట్స్ రెడ్, ప్యాంథర్ బ్లాక్ మెటాలిక్, ఫ్లేమింగ్ ఆరెంజ్, డిజిటల్ సిల్వర్, మ్యాక్స్ బ్రౌన్ మెటాలిక్ వంటి ఐదు రంగుల్లో సరికొత్త లుక్‌తో ఇది లభిస్తుంది.

4. మార్చబడిన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ - కొత్తగా విడుదల చేసిన సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌ ఫ్యూయెల్ ట్యాంక్ రీడిజైన్ చేయబడింది.

5. ఐదు జంటలు కలిగిన సరికొత్త అల్లాయ్ స్పోక్స్ - ఇది వరకూ సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌‌లో కేవలం ఐదు అల్లాయ్ స్పోక్స్ మాత్రమే ఉండేవి. కానీ కొత్త సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌లో ఐదు అల్లాయ్ స్పోక్స్‌లను ఒక్కొక్కటి రెండుగా విభజించి కొత్త లుక్ వచ్చేలా చేశారు.

6. రియర్ డిస్క్ - కొత్త సిబిజెడ్ ఎక్స్‌ట్రీమ్‌లో వెనకు బ్రేకు కూడా డిస్క్ బ్రేక్ సిస్టమ్‌తో లభిస్తుంది.

7. ఎల్ఈడి టెయిల్ ట్యాంప్ - బైకు వెనుక భాగంలో ఉండే రెడ్ లైట్ ఇప్పుడు ఎల్ఈడి బల్బులతో అప్‌గ్రేడ్ చేయబడింది.

ఇంకా ఈ బైక్‌లో కొత్త రియర్ షాకర్స్, కొత్త ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్, స్టెప్ సీట్స్, ఇంజన్‌ను కింది భాగంలో కప్పి ఉంచే అండర్‌క్రౌల్, క్లిప్ ఆన్స్‌లను బిగించి అప్‌గ్రేడ్ చేశారు. ఢిల్లీ మార్కెట్లో దీని రూ. 61,550 (ఎక్స్-షోరూమ్), రూ. 68,942 (ఆన్-రోడ్)లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2011, 14:16 [IST]
English summary
Country's largest auto maker Hero Honda introduces its upgraded version of CBZ Xtreme 150cc bike. but there is no any mechanical or performance upgrades, but company added some cosmetic and feature related changes to the bike. Here we are furnishing the details of upgridation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+