రూ. 900 కోట్ల పెట్టబుడలను వెచ్చించనున్న హీరో హోండా

Hero Honda Splendor
అమ్మకాల పరంగా ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా ఈ ఏడాది మొత్తం రూ. 900 కోట్లు పెట్టుబడులు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ మొత్తంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం త్వరలో ఏర్పాటు చేయనున్న నాలుగో ప్లాంట్‌కు రూ. 550 కోట్లు వరకూ కేటాయించనున్నట్లు హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ సీఎఫ్‌వో రవి సూద్ తెలిపారు.

నాలుగో ప్లాంటు ఏర్పాటుకు సంబంధిం స్థలాన్ని దాదాపు ఖరారు చేశామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలనే వెల్లడిస్తామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనిల్ దువా వెల్లడించారు. ప్రస్తుత అనుకూల పరిస్థితుల ప్రకారం, హీరో హోండా తన నాలుగో ప్లాంటును కర్ణాటకలో కానీ లేదా గుజరాత్‌లో కానీ, ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ రూ. 557.89 కోట్ల నికర లాభాన్ని అర్జించి 13 శాతం వృద్ధిని కనబరిచింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 491.69 కోట్లుగా ఉంది. అలాగే, సంస్థ మొత్తం ఆదాయం కూడా 33 శాతం వృద్ధిని సాధించి రూ. 4,350 కోట్ల నుంచి రూ. 5,772 కోట్లకు పెరిగింది. ఇకపోతే వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 12,34,039 యూనిట్ల నుంచి 15,29,577 యూనిట్లకు పెరిగాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2011, 10:52 [IST]
English summary
Country's largest two-wheeler maker Hero Honda Motors Limited (HHML) said, it would invest rs. 900 crore in the present fiscal.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+