హీరో మోటోకార్ప్‌గా మారిపోయిన హీరో హోండా

ఇదే విషయాన్ని నేడు కంపెనీయే అధికారికంగా దృవీకరించింది. అలాగే.. కొత్త గ్లోబల్ బ్రాండ్ ఐడెంటిటీను వచ్చే నెల లండన్‌లో విడుదల చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను హీరో మోటోకార్ప్ సజావుగా నిర్వహిస్తోంది. "హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ (హెచ్‌హెచ్ఎమ్ఎల్)ను నేడు ఫార్మల్‌గా హీరో మోటోకార్ప్ లిమిటెడ్‌గా పేరు మార్చడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రపంచపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు తన కొత్త గ్లోబర్ బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించడానికి కావాల్సిన అన్ని చట్టబద్ధమైన అనుమతులను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) నుండి పొందడం జరిగింద"ని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గతేడాది ఆరంభంలో కంపెనీ పేరు మార్పుకు సంబంధించి కంపెనీ షేర్ హోల్డర్లు కూడా తమ అంగీకారాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, కొత్త శకానికి ఇదొక ఆరంభం. బంధనాలను తెంచుకొని, ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటుకునేందుకు కంపెనీకు ఇదొక గొప్ప అవకాశమని హీరో మోటోకార్ప్ ఛైర్మన్ బ్రిజ్‌మోహన్ లాల్ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తుల అభివృద్ధి, వినియోగదారుల సంతృప్తి మరియు ప్రపంచ మార్కెట్లలో విస్తరణలకు ఇది ఆరంభమని ఈ సందర్భంగా కంపెనీ ఎండి, సీఈఓ పవన్ ముంజాల్ అన్నారు.


Click it and Unblock the Notifications








