భవిష్యత్ మోడళ్లలో హోండా టెక్నాలజీని వాడనున్న హీరో

హీరో హోండా, హోండా కంపెనీల మధ్య జరిగిన కొత్త లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం.. జపాన్ కంపెనీకు ఇండియన్ కంపెనీ 2014 వరకూ దాదాపు రూ. 2,450 కోట్ల (45 బిలియన్ యెన్) లాయల్టీను చెల్లించనున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత మోడళ్లలో ఉపయోగించుకునే హక్కు తమకు ఉందని హీరో హోండా మోటార్స్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రవి శుద్ వెల్లడించారు. స్ప్లెండర్, ప్యాషన్, సిబిడె వంటి మోడళ్లను మోడిఫై చేయడానికి లేదా కొత్త ఫ్లాట్‌ఫామ్‌ను వాడుకోవడానికి తమకు స్వతంత్రం ఉందని ఆయన వివరించారు.
గతంలో గ్రాఫిక్ డిజైన్స్ మార్పు చేయడానికి మాత్రమే హోండా అనుమతి తీసుకున్నామని, కానీ ఇప్పుడు తాము కావాలనుకుంటే, తామే స్వయంగా ఇంజన్, గేర్‌బాక్స్ మార్చడానికి లేదా ఆ ఫ్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడిందని రవి సుద్ చెప్పారు. ప్రస్తుత టెక్నాలజీను భవిష్యత్ మోడళ్లలో కూడా ఉపయోగిస్తారా అన్ని ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి మేము వాడుకోవాలనుకుంటున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications








