హీరో హోండా కొత్త బ్రాండ్ నేమ్ 'హీరో మోటో'..!?

హీరో హోండా జాయింట్ వెంచర్‌లో జపాన్‌కు చెందిన హోండా కంపెనీకు ఉన్న 26 శాతం వాటాను, భారత్‌కు చెందిన ముంజాల్ కుటుంబం ప్రమోట్ చేసిన హీరో గ్రూపు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హోండా ఈక్విటీ హీరో గ్రూప్ చేతికి వచ్చిన తర్వాత రెండు నెలల్లోగా బ్రాండ్ నేమ్‌ను మార్చాలని హీరో గ్రూప్ నిర్ణయించింది. బ్రాండ్ నేమ్, లోగో, పొజిషన్ డిజైనింగ్‌లో భాగంగా ఇప్పటికే హీరో గ్రూపు రెండు సంస్థలతో ఒప్పందాలుకు కూడా కుదుర్చుకుంది. ఈ ప్రక్రియలో భాగంగానే హీరో గ్రూప్ పేరు మార్పు చర్యను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది.
అయితే ఇక్కడో ఆశక్తికరమైన అంశం ఏంటంటే.. కేవలం కంపెనీ బ్రాండ్ నేమ్ మాత్రమే మారుతుంది, కానీ మోడల్ నేమ్ మారదు. అంటే ఉదాహారణకు ప్రస్తుతం హీరో హోండా కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోడల్ బైక్ "హీరో మోటో కరిజ్మా జెడ్ఎమ్ఆర్" గానూ అలాగే హీరో హోండా ప్లెజర్ మోడల్ స్కూటర్ "హీరో మోటో ప్లెజర్" గానూ మారే అవకాశం ఉంది. ఈ బ్రాండ్ నేమ్ మార్పు కోసం హీరో గ్రూప్ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా.. అక్షరాల రెండు కోట్లు రూపాయలు. మరి కంపెనీ పునర్వైభవాన్ని నిలబెట్టాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదుగా..! ఇదే గనుక నిజమైతే 26 ఏళ్ల "హీరో హోండా"కు బై బై చెప్పి "హీరో మోటో"కు వెల్‌కమ్ చెప్పడమే..!


Click it and Unblock the Notifications








