ఓవర్‌సీస్ మార్కెట్ల కోసం హీరో హోండా భారీ ప్రణాళికలు

విదేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ ప్లాంట్లను స్థాపించడం ఓవర్‌సీస్ కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటున్నామని హీరో హోండా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనీల్ దువా తెలిపారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం భారత రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన బజాజ్, హీరో హోండా కన్నా వంద అడుగుల ముందు ఉంది. బజాజ్ మొత్తం విక్రయాలలో 30 శాతం ఎగుమతులు జరుగుతుంటే, హీరో హోండా ఎగుమతులు మాత్రం కేవలం 2 శాతమే ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో హీరో హోండా 54 లక్షల వాహనాలను విక్రయిస్తే అందులో 2 శాతం మాత్రమే ఎగుమతి చేసింది.
హీరో హోండా ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు బజాజ్ ఆటో కూడా దేశీయ మార్కెట్ కన్నా ఎక్కువగా విదేశీ మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. అందుకే మరోసారి స్కూటర్లను ఉత్పత్తి చేయాలన్న తలంపును కూడా పకక్నపెట్టి హై-ఎండ్, స్పోర్ట్స్ బైక్‌లకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలుస్తుంది. బజాజ్ ప్రస్తుతం 50కు పైగా దేశాల్లో తమ బైక్‌లను విక్రయిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో బజాజ్ 9.72 లక్షల బైక్‌లను ఎగుమతి చేసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడిప్పుడే విదేశీ మార్కెట్లో రాణిస్తోంది. మరి ఇలా దేశీయ కంపెనీ విదేశాలపై దృష్టి సారిస్తుంటే.. మన మార్కెట్లో యమహా, సుజుకి, హోండా వంటి విదేశీ కంపెనీలు అగ్రస్థానానికి చేరుకుంటాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


Click it and Unblock the Notifications








