నిధుల కోసం వాటాలను తాకట్టు పెట్టిన 'హీరో హోండా'

Hero Honda
ప్రపంచ నంబర్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా నిధుల సేకరణ కోసం తమ వాటా(షేర్)లను తాకట్టు పెట్టినట్లు ప్రకటిచింది. హీరో హోండా ప్రమోటర్ అయిన హీరో ఇన్వెస్టిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఐపిఎల్) మరికొన్ని షేర్లను ఐఎల్&ఎఫ్ఎస్ ట్రస్ట్ కంపెనీ లిమిటెడ్‌కు తనఖా పెట్టి తద్వారా సుమారు రూ. 200 కోట్ల నిధులను సమీకరించనుంది. హెచ్ఐపిఎల్ అదనంగా 0.66 శాతానికి సమానమైన 13,18,653 షేర్లను మార్చి 7న తాకట్టు పెట్టినట్లు హీరో హోండా బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు తెలిపింది.

మార్చి 7న బాంబే స్టాక్ ఎక్సేంజ్ ముగింపు ధర ప్రకారం.. ఈ తాకట్టు పెట్టిన వాటాల విలువ దాదాపు రూ. 200 కోట్లు. ఈ లావాదేవీతో హీరో హోండా కంపెనీలో ఐఎల్&ఎఫ్ఎస్ ట్రస్ట్ కంపెనీ వాటా 5.32 శాతం నుండి 5.98 శాతానికి పెరిగింది. ఈ ఏడాది తొలి వారంలో హీరో హోండా కంపెనీ 5.32 శాతం వాటాను ఐఎల్&ఎఫ్ఎస్ ట్రస్ట్ కంపెనీ విక్రయించడం ద్వారా దాదాపు రూ. 1,585 కోట్ల నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే.

అంతే కాకుండా మార్చిన 9న యాక్సిస్ ట్రస్టీ సర్వీసెస్ లిమిటెడ్‌కు షేర్ల బదిలీ ద్వారా హెచ్ఐపిఎల్ రూ. 900 కోట్ల నిధులను కూడా సమీకరించింది. హీరో హోండా షేర్‌హోల్డర్లలో హెచ్ఐపిఎల్ ఒక ప్రధానమైన షేర్‌హోల్డర్, డిసెంబర్ 31, 2010 నాటికి హీరో హోండాలో హెచ్ఐపిఎల్‌ 17.33 శాతం వాటాను కలిగి ఉంది. హీరో హోండా జాయింట్ వెంచర్‌లో ఉన్న 26 శాతం హోండా వాటాను రూ. 3,841.83 కోట్లకు కొనుగోలు చేసేందుకు బిఎమ్ ముంజాల్‌కు చెందిన హీరో గ్రూప్ నిధులను సమీకరిస్తున్న సంగతి తెలసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, March 16, 2011, 17:20 [IST]
English summary
The promoter of Hero Honda, Hero Investments Private Ltd (HIPL), has pledged further shares of the company to IL&FS Trust Company Ltd, raising an estimated Rs 200 crore. In a filing to the Bombay Stock Exchange, Hero Honda said HIPL has pledged an additional 13,18,653 shares aggregating to 0.66% stake in the company on March 7.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+