16 శాతం పడిపోయిన హీరో హోండా క్యూ4 లాభాలు

జనవరి - మార్చి 2011 కాలంలో కంపెనీ మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 22.58 శాతం వృద్ధిని సాధించి 11,86,536 యూనిట్ల నుంచి 14,54,431 యూనిట్లకు పెరిగాయి. కాగా.. 2010-11 పూర్తి ఆర్థిక సవంత్సరానికి గానూ కంపెనీ నికర లాభం 13.62 శాతానికి తగ్గి రూ. 2,231.83 కోట్ల నుంచి రూ. 1,927.90 కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 22.32 శాతం పెరిగి రూ. 15,860.51 కోట్ల నుంచి రూ. 19,401.15 కోట్లకు పెరిగింది. అలాగే మొత్తం కంపెనీ విక్రయాలు 17.44 శాతం వృద్ధితో 46,00,130 యూనిట్ల నుంచి 54,02,444 యూనిట్లకు పెరిగాయి.


Click it and Unblock the Notifications








