హీరో హోండా కొత్త బ్రాండ్ నేమ్, లోగోల డిజైన్

Hero Honda
హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి రెండు కంపెనీలుగా విడిపోనున్న హీరో గ్రూప్, హోండా మోటార్ కంపెనీలు భవిష్యత్తులో తాము ఉత్పత్తి చేయబోయే వాహనాలుకు ఎలాంటి బ్రాండ్ నేమ్ ఇవ్వాలి, ఏ లోగోను ప్రింట్ చేయాలనే అంశంపై తలమునకలవుతున్నాయి. ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న హీరో హోండా మోటార్స్‌లోని 26 శాతం హోండా వాటాను 851 మిలియన్ డాలర్లకు హీరో గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా హీరో హోండా కంపెనీ హీరో గ్రూప్ చేతుల్లోకి వచ్చినట్లయింది.

ప్రస్తుతం హీరో గ్రూప్ తమ కొత్త ఉత్పత్తులకు బ్రాండ్ నేమ్, లోగోను డిజైన్ చేసే కాంట్రాక్టును లండన్‌కు చెందిన ఓమ్నికాన్ గ్రూప్‌లో భాగమైన "వోల్ఫ్ ఓలిన్స్"కు అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో వినూత్నతకు మారుపేరుగా నిలిచిన వోల్ఫ్ ఓలిన్స్ సంస్థ కొత్త బ్రాండ్‌ ఐడెంటిటీ (బ్రాండ్ ఆర్కిటెక్చర్, బ్రాండ్ నేమ్, బ్రాండ్ లోగో, బ్రాండ్ పొజిషనింగ్)ని అందరూ మెచ్చే రీతిలో తీర్చిదిద్దగలదని భావిస్తున్నట్టు హీరో హోండా మోటార్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్ పవన్‌ ముంజాల్‌ పేర్కొన్నారు. భారతీయత ఉట్టిపడేలా ఈ బ్రాండ్ ఇమేజ్ ఉంటుందని ఆయన చెప్పారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి ఈ భారతదేశ కంపెనీతో కలిసి పనిచేయడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని వోల్ఫో ఓలిన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్‌ రైట్‌ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, March 11, 2011, 11:50 [IST]
English summary
After completion of stake buying from Honda Motors in Hero Honda Motors Limited (HHML) joint venture, Hero Group is focusing on new brand identity for Hero Honda. Company allotted brand identity contract (which includes brand architecture, brand name, brand logo and brand positioning creating) to London-based Wolff Olins, part of the Omnicom group.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+