మునుపెన్నడూ లేనివిధంగా త్రైమాసిక అమ్మకాలు

ఈ త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు 15,29,577 యూనిట్లుగా ఉండి, గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 24 శాతం ఎక్కువ. అంతేకాకుండా.. కంపెనీ తన చరిత్రలో ఏ త్రైమాసికంలోనూ ఇంత భారీ స్థాయిలో విక్రయాలను నమోదు చేసుకోలేదు. ఈ త్రైమాసికంలోనూ ప్రతి నెలలోనూ కంపెనీ ఐదు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించడం విశేషం. ఈ త్రైమాసికంలో హీరో హోండా గ్లామర్, గ్లామర్ ఎఫ్1, కరిజ్మా, కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోడళ్లను అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








